ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సెరెనా విలియమ్స్

Posted On:31-01-2015
No.Of Views:301

ఆస్ట్రేలియన్ ఓపెన్ మళ్లీ నల్లకలువనే వరించింది. మొదటి ర్యాంకర్ సెరెనా విలియమ్స్, రెండో ర్యాంకర్ మారియా షరపోవాల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సెరెనా వరుస సెట్లలోప్రత్యర్థిని ఓడించింది. తన పవర్ గేమ్ మొత్తాన్ని ప్రదర్శించి, రెండో ర్యాంకర్ మీద ఆధిపత్యం చూపించింది.మొదటి సెట్ను 6-3తో  గెలుచుకున్న సెరెనా విలియమ్స్.. రెండో సెట్లో మాత్రం కొంత చెమటోడ్చాల్సి వచ్చింది. ఆ సెట్ 6-6తో టై కావడంతో మారథాన్ టైబ్రేకర్ నడిచింది. అందులో ఇద్దరూ హోరా హోరీగా తలపడ్డారు. చివరకు 7-5 తేడాతో పైచేయి సెరెనాదే అయ్యింది. దీంతో సెరెనా తన కెరీర్లో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నట్లయింది.