పవన్ కల్యాణ్ సరసన నటించనన్న అక్షర హాసన్

Posted On:31-01-2015
No.Of Views:337

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అదీ టాలీవుడ్ ఎంట్రీకే అటువంటి బంపర్ ఆఫర్ వస్తే ఎవరైనా తిరస్కరిస్తారా? కానీ ఓ నూతన నటి అటువంటి అవకాశాన్ని వదులుకుంది. ఇది అక్షరాల నిజం.  వెతుక్కుంటూ వచ్చిన అటువంటి అవకాశాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్, సారికల రెండవ కుమార్తె అక్షర హాసన్ వదులుకున్నారు.పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ మూవీ గబ్బర్‌సింగ్‌ 2లో హీరోయిన్‌గా నటించే అవకాశం అక్షరని వరించింది. అయితే  ఈ నీల కళ్ల సుందరి ఆ బంపర్ ఆఫర్‌ని తిరస్కరించింది. టాలీవుడ్‌లో తన డెబ్యూ మూవీ అంతటి స్టార్ హీరో సరసన ఉంటే, ఇక తరువాతి సినిమాలపై భారీగా అంచనాలు పెరిగిపోతాయన్న భయాన్ని అక్షర వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది. గబ్బర్‌సింగ్ పార్ట్‌ వన్‌లో అక్షర అక్క శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.అక్షర హాసన్ నటించిన తొలి చిత్రం షమితాబ్ (హిందీ) చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఆర్.బల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న షమితాబ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ రేఖ, తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.