ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ రహస్యంగా చేతులు కలిపాయి :ప్రధాని మోదీ

Posted On:01-02-2015
No.Of Views:279

దిల్లీ : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ, కాంగ్రెస్‌లు రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. దిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగిస్తూ గతంలో దిల్లీ ప్రభుత్వ బాధ్యతల్ని ఒకరికి అప్పగిస్తే వారు పారిపోయిన వుదంతాన్ని గుర్తు చేశారు. దిల్లీకి బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాల్సివుందని ఆయన పేర్కొన్నారు.
ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు 
- దిల్లీలో తాగునీటి సమస్య పరిష్కారానికి హర్యానా సహకారం తీసుకుంటాం. 
- గతంలో మీరు ఓటు వేసి గెలిపించిన వారు నెలన్నర రోజుల్లోనే చేతులు ఎత్తేశారు. 
- భాజపా అధికారంలోకి వచ్చాక పెట్రో ధరలు తగ్గాయి.
- నిత్యం ఆందోళనలు చేసేవారికి ఓటు వేయవద్దు. 
- మనదేశంలో దాదాపు 75 శాతం యువత వుంది. 
- ఈ యువతే మనను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడుతోంది.
- దిల్లీ ప్రజలు మాపై వుంచిన విశ్వాసాన్ని వడ్డీతో సహా చెల్లిస్తాం. 
నా వెనుక 125 కోట్లమంది ప్రజలు వున్నారన్న విషయాన్ని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటాను. 
- దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. 
- నేను పెద్దగా చదువుకోలేదు అయినా భారతీయుల ఆలోచనా సరళి నాకు తెలుసు
-