గుండు చేయించుకున్నందుకు శిక్ష!

Posted On:01-02-2015
No.Of Views:321

లండన్:ఓ 14 ఏళ్ల బాలుడు చేపట్టిన సేవా కార్యక్రమం కాస్తా అతనికి శాపంగా మారింది. యూకేకు చెందిన స్టాన్ లాక్ అనే బాలుడు ప్రాణాంతక క్యాన్సర్ కు నిధులు సమీకరించాలని తలపెట్టాడు. అందులో భాగంగానే తన తలపై జట్టును తొలగించుకుని నున్నటి గుండుతో ఫండ్స్ సమీకరించే పనిలో పడ్డాడు.  ఆ బాలుడు అలా దర్శనమివ్వడం అతను చదువుతున్న స్కూల్ నిబంధనలను అతిక్రమించడమేనట. దీంతో బాలునిపై స్కూల్ యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఆ బాలున్ని ఒక గదిలో బంధించి ఉంచింది. తిరిగి జట్టు పెరిగే వరకూ ఆ బాలుడు స్కూల్ పిల్లలకు దూరంగా ఉండాలని యాజమాన్యం స్పష్టం చేసింది.ఆ బాలుడు క్యాన్సర్ పై అవేర్ నెస్ ను తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అతని చదువుకి తీవ్ర అడ్డంకిగా మారింది. ఆ బాలుడు క్యాన్సర్ పై అవేర్ నెస్ తీసుకొచ్చి దాదాపు 500 డాలర్లు(రూ.ముప్ఫై వేలు) లను సేకరించడం గమనార్హం.