ఎంపిక ఏ ప్రాతిపదికన...

Posted On:01-02-2015
No.Of Views:316

జాతీయ క్రీడల్లో ఆయా రాష్ట్రాల తరఫున పాల్గొనే బాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగిందో అర్థం కావడం లేదని స్టార్ షట్లర్ గుత్తా జ్వాల పేర్కొంది. సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు శనివారం విజయవాడ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ చాలా టోర్నమెంట్లలో మహారాష్ట్రకు చెందిన కొందరు క్రీడాకారులు తెలంగాణ తరఫున ఆడుతున్నారనని.. సీనియర్ క్రీడాకారిణైన తాను హైదరాబాద్‌లోనే ఉన్నా జాతీయ క్రీడల జట్టుకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని ఆరోపించింది. అకాడమీ నిర్వాహకుడిగా ఉన్న గోపీచంద్‌కే భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్‌గా, జట్టు ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఇన్ని బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరముందా అని జ్వాల ప్రశ్నించింది. క్రీడాకారుల విషయంలో వివక్ష, రాజకీయాలు ఎక్కువవడం వల్ల పిల్లలు క్రీడల్లోకి వస్తామంటుంటే వారి తల్లిదండ్రులు అడ్డుచెప్పే పరిస్థితి ఉందని చెప్పింది. క్రీడాకారుల ఆట చూసి కాకుండా.. తమ మాట వినేవారిని జట్టులోకి ఎంపిక చేస్తున్నారని ఆరోపించింది. తాను మహా అయితే ఇంకో రెండేళ్లు ఆడతాననని.. తాను లేవనెత్తుతున్న అంశాలు తర్వాతి తరం క్రీడాకారుల గురించేనని జ్వాల పేర్కొంది.