అగ్రహీరోకు అండగా నిలిచిన మరో హీరో

Posted On:04-02-2015
No.Of Views:296

కొచ్చి: వారిద్దరూ మలయాళం సూపర్ స్టార్స్. వృత్తిపరంగా వారిద్దరూ తెరపై పోటీ పడుతుంటారు. కాని కష్టాల్లో ఉన్న తోటి నటుడికి బాసటగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు మరో అగ్ర నటుడు. అతనెవరో కాదు మమ్ముట్టి. మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ కు అతడు అండగా నిలిచాడు.తిరువనంతపురంలో ఇటీవల ప్రారంభమైన 35వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా మోహన్ లాల్ కు చెందిన 'లాలీసమ్' బ్యాండ్ సంగీత కార్యక్రమం నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమం నిరాశపరిచిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను తీసుకున్న డబ్బును తిరిగిచ్చేస్తానని మోహన్ లాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ కు మమ్మూట్టి మద్దతు ప్రకటించారు.ఒక కార్యక్రమం నిర్వహించడానికి కళాకారులు ఎంతో కష్టపడతారు. మోహన్ లాల్ మనకు గర్వకారణం. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ఆయన స్ఫూర్తిని అందరూ అభినందించాలి' అని విలేకరుల సమావేశంలో మమ్మూట్టి అన్నారు. మోహన్ లాల్ కు అండగా నిలబడాలని సహచర నటులకు ఆయన పిలుపునిచ్చారు.