ఐశ్వర్యతో మనస్పర్థలా?

Posted On:04-02-2015
No.Of Views:352

నటుడు ధనుష్ చాలా బిజీ హీరో. తమిళం, హిందీ అంటూ జాతీయ స్థాయిని అధిగమిస్తున్నారు. అదేవిధంగా ఆయన అర్ధాంగి ఐశ్వర్య దర్శకురాలిగా తనను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయనే ప్రచారం హల్‌చల్ చేస్తున్నది. వీటికి స్పందించిన ధనుష్, అవన్నీ వట్టి వదంతులేనని కొట్టి పారేశారు. ఆయన మాట్లాడుతూ, తనను అందగాడిగా మార్చింది తన భార్య ఐశ్వర్య అన్నారు.ఇంటిలో తమ కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తాను ఐశ్వర్య, పిల్ల లు, అమ్మానాన్న, అన్నయ్య అంటూ ఉమ్మడి కుటుం బంగా జీవిస్తుం డడం ఆనందంగా ఉందన్నారు. తాను షూటింగ్‌లలో బిజీగా ఉండి, ఇంటి కి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంత లభిస్తుంద న్నారు. వృత్తి రీత్యా, తాను ఇంట్లో లేనప్పుడు కుటుంబ బాధ్యతలన్నీ ఐశ్వర్య చూసుకుంటున్నారని, అంతకంటే, తాను ఆశించేదేముంటుందని ధనుష్ అన్నారు.