ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడి

Posted On:04-02-2015
No.Of Views:295

పటాన్‌చెరు, మెదక్: మెదక్ జిల్లా రామచంద్రాపురంలో ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో బుధవారం భారీ దోపిడి జరిగింది. రూ. 61లక్షల విలువైన ఆభరణాలు, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం పది గంటల సమయంలో ఐదుగురు దుండగులు ఫైనాన్స్ కంపెనీలోకి చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న మేనేజర్ శంకర్రావు, అసిస్టెంట్ మేనేజర్ కృష్ణంరాజును కత్తులతో బెదిరించి, నిర్బంధించి, దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 187 ప్యాకెట్లలో ఉన్న రూ. 61లక్షల విలువైన బంగారు నగలను, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఐజీ గంగాధర్, డీఐజీ నవీన్‌చంద్, ఎస్పీ మమత సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.