అంతర్జాతీయ స్థాయిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి: కోడెల

Posted On:04-02-2015
No.Of Views:290

హైదరాబాద్: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి చికిత్స అందిస్తున్నట్లు ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోడెల మాట్లాడుతూ... క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచించారు. సమాజంలో పొగాకు సంబంధిత పదార్థాల వినియోగం వల్ల క్యాన్సర్ పెరుగుతోందన్నారు. సెల్‌ఫోన్ల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్, సినీనటుడు బాలకృష్ణ మాట్లాడుతూ.... బసవతారకం ఆసుపత్రిలో రోగులకు మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. లాభాపేక్ష లేకుండా ఆసుపత్రిని నడుపుతున్నామన్నారు. బసవతారకం ఆసుపత్రిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.