నదిలో కూలిన ట్రాన్స్ ఏషియా విమానం

Posted On:04-02-2015
No.Of Views:326

తైవాన్ :  విమాన ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తైవాన్ రాజధానిలో ఓ విమానం నదిలో కుప్పకూలింది. ట్రాన్స్ ఏషియా సంస్థకు చెందిన  విమానం తైపీ నదిలో కూలింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.  ప్రమాదం జరిగినప్పుడు ఈ విమానంలో 58మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా విమానంలో చిక్కుకున్నవారిలో 17మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. నదిలో చిక్కుకుపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు.కాగా ప్రమాదానికి ముందు విమానం టేకాఫ్ అయిన తర్వాత  రోడ్డు బ్రిడ్జ్ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. దాంతో విమానం అదుపు తప్పి నదిలో కూలింది. కాగా  విమానం దాదాపు నదిలో మునిగిపోయే దృశ్యాన్ని  తైవాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ చిత్రీకరించింది.  తైవాన్‌ స్థానిక కాలమానం  ప్రకారం బుధవారం ఉదయం 10.50కి సిగ్నల్స్‌ తెగిపోయాయి. మరికాసేపట్లో లాండింగ్‌ కావాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.