ట్యాంపరింగ్ కు అవకాశం లేదు: ఈసీ

Posted On:04-02-2015
No.Of Views:292

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్(ఈవీఎం)లలో ట్యాంపరింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. బుధవారం ఈసీ ఉన్నతాధికారులను కేజ్రీవాల్ కలిశారు ఈ సందర్భంగా ఈవీఎంల పనితీరును ఆయనకు ఈసీ అధికారులు వివరించారు. కేజ్రీవాల్ సందేహాలన్నింటినీ నివృత్తి చేసినట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. ట్యాంపరింగ్ జరిగే అవకాశముందని కేజ్రీవాల్ చెబుతున్న ఈవీఎంలు 2006 ముందు బ్యాచ్ కు చెందినవని, వాటిల్లో కూడా ట్యాంపరింగ్ కు అవకాశం తక్కువేనని వెల్లడించాయి.