కాలువలోకి దూసుకెళ్లిన కారు ..పెళ్లికూతురితో సహా ఇద్దరు మృతి

Posted On:04-02-2015
No.Of Views:276

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: కొద్ది గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన నవవధువు, ఆమెకు తోడుగా వస్తున్న బంధువులు మృత్యువాతపడడం వధూవరుల కుటుంబాల్లో విషాదం నింపింది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు కరకట్ట రహదారిపై బుధవారం సాయంత్రం కారు అదుపుతప్పి కాలువలో పడటంతో వధువు సహా నలుగురు మృతి చెందారు. మరో మహిళ తీవ్ర గాయాలతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చల్లపల్లి నుంచి గుంటూరుకు పెళ్లికుమార్తెను తీసుకువెళుతున్న కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కారు అదుపు తప్పి కాల్వలో పడిపోయింది. పెళ్లికుమార్తె అల్లంశెట్టి బాలకుమారి(అమ్ములు), ఆమె స్నేహితురాలు నాగచంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న పత్తిపాటి సోమశేఖర్ విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సోమశేఖర్ భార్య పద్మకుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరి కుమారుడు సన్నీ(8) కాల్వలో గల్లంతు కాగా గజ ఈతగాళ్లు వెతికి రాత్రి 8 గంటల సమయంలో మృతదేహన్ని వెలికితీశారు.