తప్పు చేసి గర్ల్‌ఫ్రెండ్‌పైకి తోసి...

Posted On:04-02-2015
No.Of Views:301

 లాస్‌ఏంజెల్స్: డో పింగ్‌లో చిక్కి నిషేధానికి గురైన సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. దా దాపు రెండు నెలల క్రితం కొలరాడాలో దురుసుగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన అతను, ఈ నేరాన్ని తన గర్ల్‌ఫ్రెండ్ అనా హన్సెన్‌పైకి తోసివేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తానే డ్రైవ్ చేస్తున్నట్లుగా ముందుగా అంగీకరించిన అనా, ఆ తర్వాత పోలీసు విచారణలో ఆర్మ్‌స్ట్రాంగ్‌దే తప్పని బయటపెట్టింది.  ప్రమాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మ్‌స్ట్రాంగ్‌కు 90 రోజుల జైలుశిక్షతో పాటు 300 డాలర్ల వరకు జరిమానా పడవచ్చు.