సల్మాన్ క్లబ్‌లో మన ముద్దుగుమ్మలు

Posted On:04-02-2015
No.Of Views:329

సినిమాల వసూళ్లను ఇప్పుడు వందకోట్ల క్లబ్, రెండు వందల కోట్ల క్లబ్, ఐదొందల కోట్ల క్లబ్ అంటూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ తరహా ప్రచారం ముందుగా బాలీవుడ్‌లో ఆరంభమైంది. అక్కడ షారూఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్ చిత్రాలు భారీ వసూళ్లతో ఈ క్లబ్‌ల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. తాజాగా సల్మాన్‌ఖాన్ క్లబ్ అనే ప్రచారం మొదలవుతోంది. దాని ప్రత్యేకత ఏమిటంటే ఒకస్థాయి దాటిన అవివాహిత హీరోయిన్లు ఈ క్లబ్‌లోకి చేరుతారట.అలా సల్మాన్ క్లబ్‌లో ఇప్పటికే టబూ, ప్రీతిజింతా, ప్రియాంక చోప్రా, కత్రినాకైఫ్ వంటి నాయికలు చేరారు. వీరంతా పెళ్లీడు దాటినా ఎలాంటి చింతా లేకుండా నటనకే అంకితమైపోయారు. ఇక దక్షిణాదిలో అనుష్క, శ్రీయ, ఇలియానా, నయనతార, తమన్న, ఛార్మి వంటి వారు సల్మాన్  క్లబ్‌లో చేరిపోయారట. నటి త్రిష మాత్రం ఇటీవల వరుణ్‌మణియన్‌తో నిశ్చితార్థం జరుపుకుని ఈ క్లబ్‌లో పేరు నమోదు కాకుండా తప్పించుకున్నారు.