త్రిష మిడ్ నైట్ పార్టీ ఎవరితో...

Posted On:04-02-2015
No.Of Views:316

రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ జరుపుకున్న త్రిష... బాలకృష్ణ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడ ఆమె తన టాలీవుడ్ ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చింది. లేట్ నైట్ ఇచ్చిన ఈ పార్టీకు సంభందించిన ఫొటో మీరు ఇక్కడ చూస్తున్నది. ఈ పార్టీలో ఆమెతో క్లోజ్ గా ఉన్న మంచు లక్ష్మీ, మంచు మనోజ్. నిఖిషా పటేల్, జయంత్ పరాంన్జీ, షిడ్నీ సల్దాన్ వంటి వారు పాల్గన్నారు. ఇంకా కొందరు హైదరాబాద్ లోని ఆమె ఫ్రెండ్స్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు చెన్నై చిన్నది త్రిష, నిర్మాత వరుణ్‌ మణియన్‌ల నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో జరిగింది. 1999లో 'మిస్‌ చెన్నై'గా ఎంపికైన త్రిష 2002లో తమిళ తెరకు పరిచయమైంది. 'వర్షం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని దాదాపు 12 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించింది. 'వాయై మూడి పేసవుం' చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైన వరుణ్‌మణియన్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. శుక్రవారం ఉదయం వీరి నిశ్చితార్థం చెన్నై, ఆళ్వార్‌పేటలోని వరుణ్‌ మణియన్‌ ఇంట్లో జరిగింది. కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. త్రిషను ముంబయికి చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ముస్తాబు చేశారు. అనంతరం త్రిష, వరుణ్‌ ఉంగరాలు మార్చుకున్నారు. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరు నటీ నటులకు శనివారం విందు ఇచ్చింది. అనుకున్నట్లుగా జనవరి 23న చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. చెన్నైలోని ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ పార్టీలో ఛార్మీ, మాధవన్, ధనుష్, శింబు, ఆర్య, సంగీత దర్శకుడు అనిరుధ్, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారు పాల్గొన్నారు.