నందమూరి ఫ్యామిలీ ‘మల్టీస్టారర్‌’?

Posted On:05-02-2015
No.Of Views:350

నందమూరి వంశానికి చెందిన కళ్యాణ్‌రామ్‌ ‘పటాస్‌’ విజయం తర్వాత చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తన తర్వాతి ప్రాజెక్టు బాబాయి బాలకృష్ణ,తమ్ముడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి మల్టీస్టారర్‌ సినిమా తీసే ప్లాన్‌లో ఉన్నాడు. ఓ ఇద్దరు సినీ రైటర్స్‌ను పిలిపించి, బాలయ్య కీలకపాత్ర వహిస్తూ, ఇద్దరు అన్నదమ్ముళ్లు కలిసి నటించే కథను తయారు చేయాలని పురమాయించినట్లు టాలీవుడ్‌ కథనం. అయితే కళ్యాణ్‌రామ్‌ ఈ ప్రాజెక్టులో నటించాలని బాలకృష్ణను,జూనియర్‌ను అడగకపోయినా, తన మీద ప్రేమతో నటిస్తారని నమ్ముతున్నారు.జూనియర్‌ ఎలాగూ నటిస్తాడు. మరి బాలకృష్ణ నటిస్తారో లేదో చూడాలి. ఇక కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా రవితేజతో నిర్మిస్తున్న ‘కిక్‌`2’ పూర్తి కావొస్తుంది. దీని తర్వాత మరో చిత్రం ’షేర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి రెండు పూర్తయిన తర్వాత నందమూరి ఫ్యామిలీ పిక్చర్‌ ప్రారంభమవుతుంది(ట). అయితే ఎన్టీఆర్‌ పాత సినిమా ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాకు న్యూలుక్‌ అద్దుతున్నరని వినికిడి.