ఐటెంగాళ్‌గా మధురిమ

Posted On:05-02-2015
No.Of Views:312

అందాలను ఒలకబోసినా టాలీవుడ్‌లో పెద్దగా రాణించలేకపోయిన ‘వంశీ’ బొమ్మ ‘మధురిమ’ చివరకు ఐటెంసాంగ్‌కు ఒప్పుకుంది. అడపాదడపా తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సరైన బ్రేక్‌ రాని ఈ అమ్మడు, నాగచైతన్యతో కలిసి ఐటెంసాగ్‌లో ఆడిపాడబోతుంది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్న నాగ్‌ చైతన్య సినిమాలో మధురిమతో ఐటెంసాంగ్‌ ఉంటే ఎలా ఉంటుందోనని దర్శకుడు ఆలోచన చేశాడట. ఈ విషయాన్ని నాగ చైతన్యతో చెబితే,ఆయన ఒప్పుకున్నాడని, దాంతో సాంగ్‌ను సిద్ధం చేసినట్లు వినిపిస్తోంది. మధురిమ ఈ ఐటెంసాంగ్‌లో తన అందాలన్నీ ఆరబెట్టినట్లు టాలీవుడ్‌ కథనం. సరే ఇలాగైనా మధురిమకు దశ తిరుగుతుందేమో చూడాలి.