తెలంగాణ ఉద్యోగులకు వేతన సవరణ

Posted On:05-02-2015
No.Of Views:286

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వేతన సవరణ ప్రకటించారు.సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల వేతన ఫిట్ మెంట్ ను 43 శాతంగా ఆయన ప్రకటించారు. ఈ పీఆర్సీసీ 2014 జూన్ 2నుంచి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో 39 శాతం ఫిట్ మెంట్ ను మరో నాలుగు శాతం పెంచడంతో ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ తాజా పెంపుతో ప్రభుత్వంపై రూ.6,500 కోట్ల అదనపు భారం పడనుంది.ఉద్యోగుల వేతన సవరణ పెంపు పై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈరోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసిన సంగతి తెలిసిందే. సీఎంను కలిసిన వారిలో హైపవర్ కమిటీ చైర్మన్ సతీష్ చంద్ర తదితరులు ఉన్నారు.