విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం!

Posted On:05-02-2015
No.Of Views:283

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమయ్యింది.  తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కి డిస్కంలు ప్రతిపాదనలను అందజేయడంతో ఛార్జీల పెంపు అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిస్కంలు అందజేసిన ప్రతిపాదనలపై ఈనెల్లో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ప్రభుత్వానికి ఈఆర్సీ సిఫార్సు చేయనుంది. ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.