సంగీత దర్శకుడు శ్రీ ఆరోగ్య పరిస్థితి విషమం

Posted On:05-02-2015
No.Of Views:291

ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు,  యువ సంగీత దర్శకుడు  శ్రీ అనారోగ్యంతో గురువారం రాత్రి  కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు.  శ్రీ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ తెలుగులో 'గాయం, అమ్మోరు' తో పాటు దాదాపు 20 చిత్రాలకు సంగీతం అందించారు.ఆయన పనిచేసిన చిత్రాల్లో అనగనగా ఒకరోజు, సింధూరం తదితర చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. శ్రీ సంగీతం అందించటంతో పాటు ప్లేబ్యాక్ సింగర్గా కూడా పనిచేశారు. 2005లో విడుదలైన 'చక్రం' సినిమాలోని 'జగమంత కుటుంబం మాది..' పాటను పాడారు. శ్రీ ఎక్కువగా కృష్ణవంశీ చిత్రాలకు పనిచేశారు. ఈ యువ సంగీత దర్శకుడు తాజాగా గోపీచంద్ సాహసం చిత్రానికి పనిచేశారు.