యాక్షన్‌లోకి సిసింద్రీ

Posted On:05-02-2015
No.Of Views:295

ఎట్టకేలకు అఖిల్ సినిమా మొదలైంది. లాంఛనంగా కొబ్బరికాయ్ కొట్టుకొంది. దర్శకుడు వి.వి.వినాయక్ సూపర్ సబ్జెక్ట్‌తో రెడీ అయిపోయారు. కాకపోతే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలెట్టలేదు. ఫిబ్రవరి 9 నుంచి సిసింద్రీ యాక్షన్‌లోకి దిగిపోతాడని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. తొలుత అఖిల్‌పై యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తారట. ఈలోగా కథానాయిక అన్వేషణ కూడా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు ట్యూన్లు సిద్ధం చేశారట. అందులో అఖిల్ ఎంట్రీ పాట కూడా ఉందని సమాచారం. అఖిల్ అదిరిపోయే స్టెప్పులు వేయడానికి అనువుగా ఈ పాటని తమన్ రెడీ చేశాడట. ఇక లైట్స్, కెమెరా, యాక్షన్... అనడమే తరువాయి.