చిన్నితెరపై షారుఖ్

Posted On:06-02-2015
No.Of Views:271

మార్చి 2 రాత్రి తొమ్మిది గంటల నుంచి 'ఖీ టివి' ఒక సంచలన గేమ్ షో ప్రసారం చేయనుంది. ఈ రియాలిటీ షో పేరు 'ఇండియా పూఛేగా... సబ్సే షానా కౌన్'. ఈ గేమ్ షో అంతర్జాతీయ ఫార్మెట్ 'హూ ఈజ్ ఆస్కింగ్' తరహాలో వుంటుంది. అసలు సంచలనమేమిటంటే బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఈ గేమ్ ను నిర్వహించడమే! స్పిరిట్ ఆఫ్ లివింగ్‌ను ఆదరించే దిశగా ఈ గేమ్ షోను సాగనుంది. ఈ షోలో రజియా సుల్తాన్, బేగుసరాయ్, భాబీజీ ఘర్ పర్ హై వంటి సినిమా కథల ఫిక్షన్ ప్రధానాంశంగా ఉండబోతోంది. షారుఖ్ ఖాన్ నటజీవితం 1988లో లేఖ్ టాండన్ టెలివిజన్ సీరిస్ 'దిల్ దరియా'తో మొదలై, అజీజ్ మీర్జా సీరీస్ 'సర్కస్', మణి కౌల్ తీసిన 'ఇడియట్' తో పుంజుకుంది. 1991లో తల్లి మరణించడంతో దిల్లీ వదలి ముంబై చేరుకొని హేమామాలిని తొలి దర్శకత్వ చిత్రం 'దిల్ ఆసనా హై' లో నటించడం, ఉన్నత శిఖరాలు చేరుకోవడం అభిమానులకు తెలిసిన విషయమే. లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక 'ప్రపంచపు అతిపెద్ద మూవీ స్టార్' గా బాద్షాను ప్రశంసించింది. ఇంతపెద్ద స్టార్ తన మూలాలను మరవకుండా బుల్లితెరను ఆదిరించడం ఆయన సంస్కారం కదూ!