తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి...

Posted On:06-02-2015
No.Of Views:304

అనంతపురం: తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు మినీ లారీ కింద పడి మరణించాడు. ఆ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ సమీపంలోని రహదారిపై చోటు చేసుకుంది. నారాయణరెడ్డిపల్లెకు చెందిన జయచంద్ర కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే శుక్రవారం ఉదయం ఎల్లుట్ల - మడ్డిపల్లి రోడ్డు సమీపంలో ట్రాక్టర్లో రాళ్లు నింపడానికి వెళ్లాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న తేనెతుట్టే కదిలి...జయచంద్రపై  దాడీ చేశాయి. దాంతో పారిపోయే క్రమంలో రోడ్డుపైకి వేగంగా పరిగెత్తాడు. అంతలో వేగంగా వస్తున్న మీని లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.