చిరకాల మిత్రునితో శ్రేయాఘోషాల్ వివాహం

Posted On:06-02-2015
No.Of Views:312

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రముఖ గాయనిగా పేరొందిన శ్రేయాఘోషాల్ పెళ్లికూతురయ్యింది. తన బాల్య మిత్రుడు శీలాదిత్య ముఖోపాధ్యాయను ఆమె వివాహమాడారు. ముంబయిలో బంధుమిత్రులు, స్నేహితుల మధ్య గురువారం రాత్రి వారి వివాహం నిరాడంబరంగా జరిగింది. శ్రేయ తన పెళ్లి ఫొటోను ట్విట్టర్‌లో ఈరోజు పోస్ట్ చేశారు.