నితీశ్ కటారా హత్యకేసులో దిల్లీ హైకోర్టు తీర్పు

Posted On:06-02-2015
No.Of Views:297

నితీశ్ కటారా హత్యకేసులో దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితులకు జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. వికాస్, విశాల్ యాదవ్‌లకు 25 ఏళ్ల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించింది. మరో నిందితుడు సుఖ్‌దేవ్ పహల్వాన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దిల్లీలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల నితీశ్ కటారాని 2002 ఫిబ్రవరిలో నిందితులు హత్య చేశారు. తమ సోదరితో నితీశ్ ప్రేమవ్యవహారం నచ్చని వికాస్, విశాల్ యాదవ్‌లు అతనిని దారుణంగా కొట్టి చంపారు.