రాఘవేంద్రరావు, నాగ్ మరో చిత్రం

Posted On:06-02-2015
No.Of Views:281

 దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హీరో నాగార్జున కాంబినేషన్లో మరో భక్తిరస చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఇటీవల దర్శకుడు రాఘవేంద్రరావు ఆ చిత్ర కథను హీరో నాగార్జునను కలసి  వివరించారు. ఇదే విషయంపై రాఘవేంద్రరావు మాట్లాడుతూ...  రెండు వారాల క్రితం రాఘవేంద్రరావుగారు కలసి తనకు కథను వివరించారని చెప్పారు. కథ, కథనం మనస్సుకు హత్తుకునే విధంగా ఉందని... తాను నటించేందుకు సిద్దమని రాఘవేంద్రరావుగారికి వెల్లడించినట్లు చెప్పారు. . కథనం చాలా బాగుందని... ఈ చిత్రంలో నటించేందుకు తాను అంగీకరించినట్లు చెప్పారు. అయితే ఇప్పటికే పలు చిత్రాలలో మహాబిజీగా ఉన్న నాగ్... ఆ చిత్రాలు పూర్తికాగానే ఈ చిత్రంలో నటించనున్నారు.ఇప్పటికే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి చిత్రాలకు ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అలాగే రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో త్వరలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా ప్రేక్షకులు మనసు దోచుకుంటుందని ఫిలింవర్గాలు సమాచారం.