సమంతా ప్లేసులో రకుల్‌

Posted On:08-02-2015
No.Of Views:274

చెన్నై భామ సమంతాను శ్రీనువైట్ల మార్చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌ పాత్ర కీలకం. ఈ చిత్రానికి రచన చేసిన కోన వెంకట్‌,గోపీమోహన్‌ సమంతాను దృష్టిలో పెట్టుకునే కథను మలిచారు. ఈ కథ కూడా రామ్‌ చరణ్‌కు బాగా నచ్చింది. ఏమైందో తెలియదు కానీ, శీనువైట్ల సమంతాను ఈ ప్రాజెక్టు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి చిన్న పాటి సంచలనానికి కారణమయ్యారు. డేట్లు సర్దుబాటు చేయలేకపోయిందనే కారణంతోనే తొలగించినట్లు చెబుతున్నప్పటికీ, వేరే కారణాలున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఈ మధ్య సమంతా సినిమాలన్నీ హిట్టవ్వడంతో హీరోతో సమానంగా పాత్ర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వినిపిస్తోంది. రామ్‌ చరణ్‌ దీన్ని ఒప్పుకుంటాడా. హీరోయిన్నే తీసేయమని, అవసరమైతే కొత్త హీరోయిన్‌కు ఛాన్స్‌ ఇవ్వమని చెప్పాడట. దాంతో ఆ ఛాన్స్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు వరించింది. సమంత ప్లేస్‌లో శృతి హాసన్‌ను తీసుకోవాలని అనుకున్నారు. అయితే డేట్లు సర్దుబాటు చేయలేనని ఆమె చెప్పడంతో రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఛాన్సిచ్చారు. ఎంతైనా రకుల్‌ అదృష్టవంతురాలు. రెండు సినిమాలతోనే ప్రమోషన్‌ వచ్చేసింది.