’అప్‌’కు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిందా!?

Posted On:08-02-2015
No.Of Views:285

మొత్తానికి అన్ని సర్వేలు ఆమ్‌ ఆద్మీ పార్టీ(అప్‌)కు అధికారం వచ్చేస్తుందని తేల్చి చెబుతున్నాయి. అప్‌కు 35`45, బిజెపికి 27`35,కాంగ్రెస్‌కు 2`4 సీట్లు వస్తాయన్నది ఈ సర్వేల సారాంశం. ఢల్లీిని బిజెపి చేజేతులా జార విడుచుకుందని విశ్లేషకుల అభిప్రాయం. కేజ్రీవాల్‌తో అవినీతిపై పోరాడిన కిరణ్‌బేడీని ఆయన ప్రత్యర్థిగా రంగంలోకి దింపడం మొదటి తప్పు అని విశ్లేషకుల భావన. కిరణ్‌బేడీ సరిగ్గా ఎన్నికల ముందువచ్చారు కనుక, పార్టీలో ఉన్న గ్రూపుల్ని,నాయకుల్ని కలుపుకొని ముందుకు వెళ్లలేకపోయారని, ఇప్పటికీ ఢల్లీి పీఠంపై కన్నేసిన నేతలు, ఆమెకు వ్యతిరేకంగా పని చేశారని వినిపిస్తోంది. ఇక ఢల్లీి సీటును కైవసం చేసుకునేందుకు బిజెపి చాలా కష్టపడిరది. తాయిలాలు,బహుమతులు ఓటర్లకు అందజేసింది. అవసరాన్నిమించి ఎక్కువ మంది నేతల్ని ప్రచారానికి వినియోగించింది. ఇది కూడా ఢల్లీిలాంటి  అత్యధిక విద్యావంతులున్న చోట వికటించిందనే భావన కూడా ఉంది. ఇక మూడో అంశమేమిటంటే ఢల్లీిలో కాంగ్రెస్‌కు నాలుగు సీట్లే వస్తాయని సర్వే చెబుతోంది. గతంలో మూడుసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు నాలుగుసీట్లు మాత్రమే ఎలా వస్తాయి? మిగతా చోట్ల ఓట్లనీ ఎటు పడ్డాయి. బిజెపికి ఎలాగైనా అధికారంలోకి రానివ్వవద్దని పరోక్షంగా ’అప్‌’అ మద్దతు ఇవ్వాలని సోనియా ఎత్తులు వేసినట్లు వినిపిస్తోంది. రాజకీయాలంటే అంతే మరి! తన పరువు పోయినా పర్వాలేదు. ప్రత్యర్థికి పరువుండకూడదని రూలు. ఇప్పుడు కాంగ్రెస్‌ అదే చేసింది.