పిల్లల్ని కొట్టడంలో ముంబైవాసులే ఫస్ట్‌!

Posted On:08-02-2015
No.Of Views:379

మీ అబ్బాయి చదవడం లేదని బెంగపడుతన్నారా? కాస్తంత ఆవేశానికి లోనై వాడి వీడు వాయగొడ్తున్నారా? ఎంతైనా మీరు ముంబయి వాళ్ల ముందు తక్కువే. పిల్లల్ని చితకబాదడంలో వీళ్లు ముందున్నారట. దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం తేలింది. ముంబై నగరంలోని 1700 మంది తల్లితండ్రులను ఒక సంస్థ సర్వే చేసింది. పిల్లల్ని దండిరచడంలో ముంబై తల్లితండ్రులు ముందే ఉంటారట. ఏ విషయాన్ని అడగటానికి మొహమాటమేదీ ఉండదు. మొన్న బాయ్‌ఫ్రెండ్‌తో ఫలానా పార్కులో కనిపించావని నిలదీయడానికి కూడా వెనుకాడరట. చిన్నారులైతే రోజూ తల్లితండ్రులతో తన్నులు తినాల్సిందే. చదవడం లేదనో, ఇంట్లో పనులు సక్రమంగా చేయడం లేదనో, టైమ్‌కు నిద్రలేవడం లేదనో, హోంవర్కులు పూర్తి చేయడం లేదనో ..ఏదో ఒకటి సాకు పెట్టుకొని వీపు వాయించేస్తార్ట. అయితే 29శాతం తల్లులు, 61 శాతం తండ్రులు పిల్లలపై చేయి చేసుకుంటారట.  బర్న్‌స్మార్ట్‌ అనే ఆర్గనైజేషన్‌ ఈ సర్వేను నిర్వహించింది. ముంబై తల్లితండ్రులు ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు!