మార్చిలో ఎన్టీఆర్‌ సినిమా

Posted On:08-02-2015
No.Of Views:301

సుకుమార్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త సినిమా మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. బండ్ల గణేష్‌ నిర్మాతగా, పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో నిర్మాణం పూర్తయిన టెంపర్‌ ఆడియో సక్సెస్‌ పట్ల జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆనందంగా ఉన్నాడు.  సినిమా కూడా సక్సెస్‌ అవుతుందని జూనియర్‌ నమ్ముతున్నాడు. టెంపర్‌ ఈనెల 13న విడుదలవుతోంది.  దీని తర్వాత మార్చి మొదటివారంలో సుకుమార్‌ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాను ’అత్తారింటికి దారేది?’ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  జూనియర్‌ను దృష్టిలో పెట్టుకొని సుకుమార్‌ మంచి టెంపో ఉన్న కథను సిద్ధం చేసుకున్నాడట. హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్‌, మిగతా సుకుమార్‌ టీం ఉంటుంది.