రాణీరుద్రమదేవి సాంగ్‌ లీక్‌?

Posted On:08-02-2015
No.Of Views:289

గ్రాఫిక్స్‌,డిజిటలైజేషన్‌ వచ్చాక సినిమా లీకులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఈ మధ్య జక్కన్న బాహుబలి సినిమా వీడియోలను యూటూబ్‌లో లీక్‌ చేశాడో ప్రబుద్ధుడు. పోలీసులు ఈ లీకు వీరుడిని పట్టుకొని జైల్లో తోశారు.
 ఇప్పుడు రాణి రుద్రమదేవి సినిమాలో కీలకమైన సాంగ్‌ వీడియోను లీక్‌ చేసినట్లు వినిపిస్తోంది. అనుష్క, సినిమాలో ఆమెకు భర్తకు నటిస్తున్న దగ్గుపాటి రాణాకు మధ్య తీసిన పాట గత కొద్దిరోజులుగా యూటూబ్‌లో హల్‌ చల్‌ చేస్తోందట.  ఈ పాటను ఫ్రీడౌన్‌లౌడ్‌ చేసుకొని అభిమానులు ఆనందిస్తున్నారట.  ఈ పాటను ఇళయరాజా కంపోజ్‌ చేశారు. ఇది ఎక్కడా లీక్‌ కాలేదని, కేవలం రూమరేనని నిర్మాతలు చెబుతున్నారు. అయితే వీడియోలు ఎక్కడ లీక్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఎవర్ని నమ్మాలో ఏమో!?