రోడ్డు ప్రమాదంలో న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం

Posted On:08-02-2015
No.Of Views:336

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యూస్ రీడర్ బద్రి(38) మృతి చెందాడు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద శనివారం రాత్రి బంధువుల వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామం నల్లచర్ల మండలం ఆవుపాడుకు వస్తుండగా లక్ష్మీనగర్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మృతి చెందాడు. బద్రి పూర్తి పేరు కాళ్ల వీరభద్రరావు. ప్రమాదంలో బద్రి భార్య లక్ష్మీసుజాత, కుమారులు సాయి, సాత్విక్, బద్రి బంధువు గండ్రోతు తారక్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సాయి(12) ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.