విభేదాలొద్దు: మోడీ

Posted On:08-02-2015
No.Of Views:323

అందరు కూడా విభేదాలు మరిచి అభివృద్ధి, ఉద్యోగాలు, పెట్టుబడుల పైన దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులకు సూచించారు. నీతి అయోగ్ తొలి సమావేశంలో మోడీ పలు సూచనలు చేశారు. పేదరిక నిర్మూలన అతిపెద్ద సవాలని చెప్పారు. అభివృద్ధి కోసం మన మధ్య ఉన్న అన్ని విభేదాలు మరిచిపోవాలన్నారు. కేంద్ర, రాష్ట్రాలు ఐక్యతతో ముందుకు వెళ్లాలని మోడీ అన్నారు. మేకిన్ ఇండియా లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి, సేవారంగాల అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలన్నారు. కాగా, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాము చేపట్టిన పథకాలను తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వివరించారు. భేటీ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విభజన బిల్లులోని హామీలు నెరవేర్చాలని కోరామన్నారు. ఏపీలో 35 శాతం రెవెన్యూలోటు ఉందని తెలిపారు. నీతి అయోగ్‌కు ప్రభుత్వం తరఫున సూచనలు చేసినట్లు చెప్పారు. కేంద్ర పథకాలు, స్వచ్ఛ భారత్, నైపుణ్యాభివృద్ధిపై ఉపసంఘాలు ప్రకటించారని చెప్పారు. కాగా, విధానాల రూపకల్పన, సుపరిపాలన అందించడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ముఖ్యమంత్రులు విలువైన సూచనలు ఇచ్చారని చెప్పారు. అభివృద్ధి, పెట్టుబడులకు ఆకర్షణీయ, విలువైన సూచనలు ఇచ్చారన్నారు. సీఎంలు మాట్లాడుతూ.. బడ్జెట్లో రాష్ట్రాలకు కేటాయించిన నిధులు సింగిల్ పేమెంటులో ఇవ్వాలని కోరారు.