నడిరోడ్డుపై ఎంపీని, బాడీగార్డ్స్‌ను కాల్చేసిన దుండగులు

Posted On:08-02-2015
No.Of Views:324

కెన్యాలో ఓ ఎంపీతోపాటు అతని బాడీగార్డులను దుండగులు నడి రోడ్డుపై కాల్చి చంపారు. దేశ రాజధాని నైరోబీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ హత్య పక్కా ప్లాన్‌ ప్రకారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. నైరోబీ ప్రధాన వీధిలో న్యూస్‌ పేపర్‌ కొనుక్కునేందుకు వాహనాన్ని ఆపిన ఎంపీ జార్జ్‌ ముసాయ్‌ను అతి సమీపంలో దుండగులు షూట్‌ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు బాడీ గార్డులతోపాటు కారు డ్రైవర్‌ కూడా మృతి చెందాడు. కెన్యా ప్రభుత్వ కూటమికి చెందిన ముసాయ్‌ రెండేళ్ల క్రితం ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీని షూట్‌ చూసిన తర్వాత దుండగులు ఆయన షూట్‌కేస్‌ను ఎత్తుకెళ్లారు. ఎంపీ హత్యను దేశ అధ్యక్షుడు ఉరు కెన్యట్టా ఖండించారు. దాడికి పాల్పడ్డ వారు బ్రీఫ్ కేసును, బాడీగార్డ్స్ వద్ద ఉన్న పిస్టోల్స్‌ను దొంగిలించుకు పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిని కెన్యా ప్రతిపక్ష నేత రైలా ఒడింగా కూడా ఖండించారు. ఇది కెన్యాలో ఉన్న అభద్రతకు నిదర్శనంగా కనిపిస్తోందని చెప్పారు.