హీరో రామ్ కొత్త సినిమా ప్రారంభం

Posted On:08-02-2015
No.Of Views:291

వరస పరాజయాలనుంచి కోలుకోవటానికా అన్నట్లు రామ్ వరస ప్రాజెక్టులను ఓకే చేసి ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన ఓకే చేసిన ప్రాజెక్టు శివం రేపే (ఫ్రిభ్రవరి 9) ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసి అందరికీ తెలియచేసారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాస రెడ్డి అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి రసూల్ ఎల్లూరి ఛాయాగ్రహణం అందిస్తూండగా...దేవిశ్రీప్రసాద్ సంగీతం, పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఇస్తున్నారు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని తెలిస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అలాగే ‘సెకండ్‌ హ్యాండ్‌' మూవీతో దర్శకుడైన కిషోర్‌ తిరుమలతో సినిమా చేసేందుకు రామ్‌ సిద్దమయ్యాడట. ఈ చిత్రానికి ‘హరికథ' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. స్క్రిప్ట్‌ వర్క్‌లో ఉన్న కిషోర్‌ తిరుమల రామ్‌ నటిస్తున్న ‘పండగ చేస్కో' చిత్రం తర్వాత 'హరికథ' మొదలు పెడతారని ఫిలింనగర్‌ టాక్‌. రామ్ తాజా చిత్రం ‘పండగ చేస్కో' విషయానికి వస్తే... రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో'. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.