బాలకృష్ణ 100 వ చిత్రం టైటిల్ ఏంటి?

Posted On:08-02-2015
No.Of Views:308

లయన్‌'గా త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రం 98 వ సినిమా. వందో చిత్రంకు దగ్గరపడుతూండటంతో బాలయ్య అభిమానుల్లో ఆనందం విల్లవిరుస్తోంది. ఈ నేపధ్యంలో బాలకృష్ణ వందో చిత్రానికి దర్శకుడు ఎవరు..ఎవరు నిర్మించబోతున్నారు... టైటిల్ ఏంటనేవి ఇప్పుడు అంతటా చర్చగా మారింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో వహించనున్నారని 'గాడ్ ఫాధర్' అనే టైటిల్ ని పెట్టనున్నారని చెప్పుకుంటున్నారు. గత కొంతకాలంగా బలకృష్ణ వరసగా సింహా, లెజండ్, లయిన్ ఇప్పుడు డిక్టేటర్ అంటూ పవర్ ఫుల్ టైటిల్స్ వైపు మ్రొగ్గు చూపుతున్నారు. దాంతో ఈ టైటిల్ కూడా బాలయ్యకు నప్పుతుందని భావిస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మరో ప్రక్క ఈ సినిమా తర్వాత బాలయ్య తన 99వ చిత్రం ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే విషయంలో స్పష్టత వచ్చింది. గతేడాది 'లౌక్యం'తో విజయం అందుకున్న శ్రీవాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. కోన వెంకట్‌, గోపీమోహన్‌ ఈ సినిమాకు కథ సిద్ధం చేస్తున్నారు. ''నేను, గోపీమోహన్‌ తొలిసారిగా బాలకృష్ణగారి కోసం కథ సిద్ధం చేస్తున్నాం. అన్ని వర్గాల వారినీ అలరించేలా వినోదాత్మకంగా సాగే కథ ఇది'' అంటూ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు కోన వెంకట్‌. ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కుతుందని సమాచారం. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు.. నందమూరి బాలకృష్ణ 99వ చిత్రానికి స్క్రిప్ట్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లయన్ చిత్ర షూటింగ్ లో ఉండగానే తదుపరి ప్రాజెక్టుకు బాలయ్య ఓకే చెప్పారు. ఈ సినిమాకు రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ లు మాటలు అందిస్తున్నారు. లక్ష్యం వాసు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. గతవారమే ఈ కథను బాలకృష్ణ ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే లయన్ పూర్తి అయిన తరువాత బాలయ్య 99 వ చిత్రం సెట్స్ పై కి వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘డిక్టేటర్'అనే టైటిల్ ని పెట్టే అవకాసముందని తెలుస్తోంది. ఆ మధ్యన బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్య తాజా చిత్రం విషయానికి వస్తే... బాలయ్య 'లయన్' చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'లెజెండ్' లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 'లయన్' చిత్రంలో కూడా బాలయ్య యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నాడు. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. బాలయ్య 'కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. నిర్మాత మాట్లాడుతూ.. '''లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.'' అని చెప్పారు.