సూర్యాపేటలో లింగమంతుల స్వామివారి జాతర

Posted On:08-02-2015
No.Of Views:259

నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లిలో లింగమంతుల స్వామి జాతరకు భక్తుల రాక ప్రారంభమయింది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు 25 లక్షలమంది భక్తులు గొల్లగట్టుకు రానున్నారు. భక్తులకు సౌకర్యంగా వైద్య సహాయకేంద్రాలతోపాటు వివిధ సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు.