రామ్‌చరణ్ మిత్రబృందం న్యూసెన్స్

Posted On:08-02-2015
No.Of Views:328

 రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు చిరంజీవి ఇంటినుంచి శ్రుతిమించిన సంగీతపు హోరు వస్తోందంటూ ఓ పోలీస్ ఉన్నతాధికారి డయల్ 100కు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ ఠాణా పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు...జూబ్లీహిల్స్ రోడ్ నెం.25లోని చిరంజీవి నివాసంనుంచి భారీగా సంగీతహోరు బయటకు వస్తోంది. సమీపంలో ఉన్న ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ ఈ శబ్దాలకు మేల్కొని.. ఉదయం 4.30గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేశారు. కొందరు యువకులు న్యూసెన్స్ చేస్తున్నారంటూ వివరించారు. విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్ నేరపరిశోధన విభాగం ఎస్సై రమేష్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. అప్పటికే చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్ ఇంటి ముందుగేటు వద్దకు వచ్చారు. ఆయనతోపాటు ఇంటి టెర్రస్‌పైన మరో నలుగురు యువకులున్నారు. వీరిలో మాజీ ఎంపీ కుమారుడు, గ్రేటర్ పరిధిలోని తెరాస ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదు మేరకు తాము సాధారణ దైనందిని (జనరల్ డైరీ- జీడీ ఎంట్రీ)లో నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ సామల వెంకటరెడ్డి వివరించారు.