కేజ్రీవాల్ విజయంపై కేసీఆర్ హర్షం

Posted On:10-02-2015
No.Of Views:299

హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆయన ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజలు ఆలోచిస్తున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విజయాన్ని గమనిస్తే ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని కేసీఆర్ అన్నారు.