ఉన్నత స్థానం పోందాలంటే ఏకాగ్రత అవసరం.. వ్యక్తిత్వ నిపుణులు బాలలింగయ్య

Posted On:10-02-2015
No.Of Views:364

గద్వాల, పిబ్రవరి 10 (అక్షరం న్యూస్‌) విద్యార్థులు ఉన్నత విద్యలో ముందడుగు సాధించాలంటే ఙాపకశక్తి, ఏకాగ్రత, లక్ష్యం ,క్రమశిక్షణ, ఉత్సాహం సమయస్పూర్తి, ఆత్మవిశ్వాసం ముఖ్యంగా ఉండాలని వ్యక్తిత్వ వికాసనిపుణులు బాలలింగయ్య తెలిపారు  గద్వాల బాలభవన్‌ లో ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకై బిసి సంక్షేమ శాఖ, స్టడి సర్కిల్‌ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు వసతి గృహ అధికారిణి ప్రమీల అద్యక్షత వహించారు. ఈ సందర్బంగా బాలలింగయ్య మాట్లాడుతు విద్యార్తులలో లక్ష్యం బలహీనపడితే విద్యదశ ముందుకు సాగదని ఆయన తెలిపారు. ఏవరో వచ్చి ఏదో చేస్తారనే మోసపోకుమా అన్న కవి మాటలకు ప్రతి విద్యార్తి రక్తంలో విజయమున్నదని గ్రహించాలని సూచించారు. విద్యార్థులు నెగిటివ్‌ గా ఆలోచన చేయకుండా పాజిటివ్‌ గా ఆలోచించాలన్నారు. ధీమంతుడు అవకాశాలను సృష్టింటుకుంటాడని పిరికివారు సాకులు చెబుతారని అన్నారు. పేదరికంలో ఉండి చరిత్రను సృష్టించిన మహాత్ముల కథలను వల్లించారు. గోప్ప వ్యక్తుల మాటలు జీవిత చరిత్రలను మార్చగలవన్నారు. పనిలో ఏకాగ్రత చాలా అవసరమని జీవితంలో ఆరు గోల్స్‌ ఉంటాయని ఇట్టి గోల్స్‌ను క్రమశిక్షణతో, ఏకాగ్రతతో సాధించాలన్నారు. విద్యార్థులలో పట్టుదల, ఆసక్తి, తపన, కఠోరసాధన అత్యవసరం కాగా వైఫల్యం దిశకు పయనించి ఓటమి పాలు కారాదని ఆయన సూచించారు. పేదరికం అభివృద్దికి అడ్డురాదని ఆలోచన , ఆత్మస్తైర్యం, సమయస్పూర్తి ఉంటే దేనినైనా సాధించగలమని ఆయన అన్నారు. స్టడి సర్కిల్‌ రీసోర్సుపర్సన్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతు నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణలో యుపిఎస్‌స్‌,టిపిఏస్‌సి తదితర ఉన్నత  పోటీ పరీక్షలలో హాజరై విద్యార్థులు ఉన్నత స్థానాలు అందుకోవాలన్నారు. ఇంటర్‌, డిగ్రీ, కంప్యూటర్‌ లిట్రసీ కమ్యూనికేషన్‌ భావాలను పెంపోంచుకుని బ్యాంకింగ్‌ రంగంలో ,ప్రోహిబిషన్‌ రంగాలలో ఆఫీసర్స్‌ లుగా, ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సమీకృత వసతి గృహ అధికారిణి ప్రమీల, డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్‌ వార్డన్‌ రంజి, బిసి సంక్షేమ శాఖ సిబ్బంది పాండు, శ్రీనివాసులు, శేఖర్‌ డీగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గోన్నారు.