తాయిక్వాండో జాతీయ రెఫరీగా శ్రీహరి

Posted On:10-02-2015
No.Of Views:319

గద్వాల, పిబ్రవరి 10 (అక్షరం న్యూస్‌)  కేరళలోని త్రివేండ్రం లో జరుగుతున్న తాయిక్వాండో జాతీయ పోటీలకు రెఫరీగా గద్వాలకు చెందిన శ్రీహరి ఎంపికయ్యారు. గత కోన్నేళ్లుగా శ్రీహరి దాదాపు 30 మార్లు రెఫరీగా ఎంపిక కావడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. జాతీయ రెఫరీగా ఎంపిక కావడం పట్ల గద్వాల ఎమ్మెల్యే డికే అరుణ, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, స్నేహితులు, కుటుంబ సభ్యులు తమ అభినందనలు తెలిపారు.