గవర్నర్ సమక్షంలో సమావేశమైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Posted On:13-02-2015
No.Of Views:303

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సాగర్ నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తున్నారు. సాగర్ కుడికాలువకు నీటి విడుదల విషయంలో నాగార్జున సాగర్ వద్ద నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంలూ భేటీ అయ్యారు. ఏపీ సీఎంతో పాటు ఆరాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అధికారులు, తెలంగాణ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, ఇరు రాష్ట్రాల డీజీపీలు హాజరయ్యారు.