షారూఖ్ ఇంటి ర్యాంప్‌ను తొలగించిన బీఎంసీ అధికారులు

Posted On:13-02-2015
No.Of Views:356

 హైదరాబాద్: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఇంటి ముందు నిర్మించిన ర్యాంప్‌ని బీఎంసీ అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా షారూఖ్ ర్యాంప్ నిర్మించారని గతంలో బీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ ర్యాంప్‌ని తొలగించకపోతే తామే తొలగిస్తామని బీఎంసీ అధికారులు గతంలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం బీఎంసీ అధికారులు షారూఖ్ ఇంటి వద్దకు చేరుకొని జేసీబీ సాయంతో ర్యాంప్‌ని తొలగించారు.