బస్సు - రైలు ఢీ: 16 మంది మృతి

Posted On:13-02-2015
No.Of Views:307

మెక్సికో:  అమెరికా - మెక్సికో దేశ సరిహద్దు ప్రాంతంలోని అన్నాహాక్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘోరం చోటు చేసుకుంది. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ట్రాక్ దాటుతున్న బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దుర్ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.