సాగర్ ఘటనపై గవర్నర్ ఆగ్రహం!

Posted On:13-02-2015
No.Of Views:357


హైదరాబాద్ :  నాగార్జున సాగర్ ఘటనపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.  సాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు కొట్టుకున్న వ్యవహారంపై ఆయన ఇరు రాష్ట్రాల డీజీపీలు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన  అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కొట్టుకుంటుంటే ఎందుకు జోక్యం చేసుకోలేదని గవర్నర్ ...డీజీపీలను ప్రశ్నించినట్లు సమాచారం.
భద్రత కల్పించాల్సిన పోలీసులే కొట్టుకోవటం సరికాదని, వారు సంయమనం పాటించి ఉండాల్సిందని గవర్నర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సాగర్ డ్యామ్కు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించి ఉండాల్సిందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు శనివారం రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో భేటీ అయ్యారు.