బిజెపి ఆఫీస్‌లో ఘోరం: బాలికపై యువకుడి లైంగిక దాడి

Posted On:14-02-2015
No.Of Views:389

పశ్చిమబెంగాల్‌లోని బెహ్లా మండల బీజేపీ కార్యాలయంలో ఘోరం జరిగింది. ఓ బాలికపై లైంగిక దాడి జరిగింది. బెహ్లాలోని ఓ 17 ఏళ్ల యువకుడు ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెహ్లా మండల బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బెహ్లాలో ఐదేళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక అదృశ్యమైన విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా స్థానికంగా ఉన్న బీజేపీ ఆఫీస్‌లో బాలిక కనిపించింది. కార్యాలయం తెరిచి చూసే సరికి బాలిక ఏడుస్తూ ఉంది. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు, బీజేపీ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. స్థానికులు బీజేపీ కార్యాలయంపై దాడి చేసేందుకు యత్నించారు.