సినీతారల ప్రేమ యవ్వారాలు

Posted On:14-02-2015
No.Of Views:389

సంవత్సరం ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) రాగానే ప్రపంచం మొత్తం ప్రేమికులు సెలబ్రేట్ చేసుకుంటుండటం చూస్తూనే ఉన్నాం. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి, వర్ణనాతీతం. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతీ రోజు ప్రేమికులు తిరుగుతుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం. ఫిబ్రవరి 14వ తేదీనే ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం వెనక పెద్ద కథే ఉంది. క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్‌లో వాలెంటైన్స్‌ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసి, వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వాలెంటైన్స్‌కి రోజురోజుకు అభిమానులు పెరిగిపోవడంతో రోమ్‌ రాజు క్లాడియస్‌కి భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారుచేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్‌ వాలెంటైన్‌కి మరణశిక్ష విధించాడు. వాలెంటైన్‌ అభిమానుల్లో క్లాడియస్‌ కుమార్తె కూడా ఉండటం విశేషం. ప్రేమకు మారుపేరుగా మారిన వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీశారు. వాలెంటైన్‌ మరణించిన తరువాత రెండు దశాబ్దాలకు క్రీ.శ. 496లో అప్పటి పోప్‌, గెలాసియస్స్‌ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా ప్రకటించాడు. ఎక్కడో రోమ్‌లో, అదీ శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది. సినిమాల ద్వారా ఈ ప్రేమ అనేది మరింత విస్తరించింది అని చెప్పక తప్పదు. పలువురు సినీ తారలు ప్రేమ వివాహాలు చేసుకుని యువతను ప్రేమవైపు నడిపించడంలో తమ వంతు ప్రయత్నం చేసారని చెప్పక తప్పదు. 
-మహేష్ బాబు, నమ్రత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తనతో పాటు వంశీ సినిమాలో నటించిన బాలీవుడ్ భామ నమ్రత శిరోద్కర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.
-జీవిత రాజశేఖర్ తెలుగు నటి అయిన జీవిత, తమిళ నటుడు అయిన రాజశేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.
-పవన్-రేణు దేశాయ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తనతో పాటు బద్రి సినిమాలో కలిసి నటించిన రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డాడు. అనంతరం కొంతకాలం సహజీవనం చేసిన పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ విడిపోయారు.
-శ్రీకాంత్-ఊహ పలు చిత్రాల్లో కలిసి నటించిన నటుడు శ్రీకాంత్, నటి ఊహ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
-నాగార్జున-అమల తనతో పాటు పలు చిత్రాల్లో నటించిన నటి అమలను నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్నారు.

-అల్లు అర్జున్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయమైన అల్లు అర్జున్, స్నేహా రెడ్డి మధ్య మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

-రామ్ చరణ్-ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమ వివాహం చేసుకుంది.

-స్నేహ-ప్రసన్న తమిళ నటులు అయిన స్నేహ-ప్రసన్న ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.

-నాని-అంజన కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన నటుడు నాని, అంజన మధ్య మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

-సూర్య-జ్యోతిక తమిళ నటుడు సూర్య, నటి జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్నారు.

-గీతా మాధురి-నందు తెలుగు సినిమా సింగర్ అయిన గీతా మాధురి, నటుడు నందు ప్రేమ వివాహం చేసుకున్నారు.