టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాదే

Posted On:22-02-2015
No.Of Views:366

 హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ ఉన్నత స్థాయి సమావేశం టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ను ఖరారు చేసింది.  మెదక్‌ జిల్లా అల్లీపూర్‌ గ్రామంలో జన్మించిన దేవీప్రసాద్‌, మలి విడత తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగసంఘాలను ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎవరితో పోటీ చేయించాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రెండు రోజుల క్రితం వరకు నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ మాజీ అధ ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి పేరు వినిపించింది. తర్వాత అనూహ్యంగా పార్టీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపేరు తెరపైకి వచ్చింది. సీఎం చంద్రశేఖర్‌రావు ఆదివారం తన క్యాంప్‌ కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో, ఉన్నతస్థాయి కమిటీతో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించారు. రాజేశ్వర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినా, అధికారికంగా వెల్లడించలేదు.