లూథియానాలో పొగమంచు...పడిపోయిన ఉష్ణోగ్రతలు

Posted On:24-03-2015
No.Of Views:322

 దేశమంతటా ఎండలు మండిపోతున్నా పంజాబ్‌లోని లూధియానాలో మాత్రం పొగమంచు కమ్మేస్తుంది. దీంతో జనజీవనం స్తంభించింది. ఉదయం 10 గంటలైనా దారి కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు దెబ్బకు లూఽథియానా ఫిల్లూర్‌ హైవేపైకి వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం 10 గంటల వరకు జనం ఇళ్లల్లోనే గడుపుతున్నారు. రెండు, మూడు రోజుల నుంచి లూధియానాలో ఇదే పరిస్థితి. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది., రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లూథియానాలో ఉష్ణోగ్రత 28 డిగ్రీలకు మించి నమోదుకావడంలేదు.