స్కూల్ వివాదంలో మహిళ సజీవదహనం

Posted On:24-03-2015
No.Of Views:311

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన పూజిత ఆత్మాహుతి ఘటనను మరవకముందే నగరంలో మరో మహిళ సజీవదహనానికి గురైంది. బోడుప్పల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో శ్రీదేవీ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు సజీవదహనం చేసిన విషయాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు.మృతురాలు శ్రీదేవి ఒక ప్రైవేటు స్కూల్లో భాగస్వామిగా ఉన్నారు. పాఠశాల నిర్వహణలో తలెత్తిన విభేదాలే హత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.